Mumbai Indians | ఐపీఎల్ 2025 సీజన్ మెగా వేలానికి వేళయింది. ఈ నేపథ్యంలో ఏ ఫ్రాంఛైజీ ఏయే ఆటగాళ్లను రీటైన్ చేసుకోవాలి అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా ఉంది. కాగా రీటైనింగ్ విషయంలో ఒక్కో ఫ్రాంఛైజీ కేవలం ఆరుగురు ఆటగాళ్లనే అట్టిపెట్టుకోగలదు. అందులో ఒక రైట్ టు మ్యాచ్ కలిసి ఉంటుంది. రీటైనింగ్‌పై ఐపీఎల్ ఓ క్లారిటీ ఇవ్వడంతో ఎక్కడ చూసినీ ఏ టీమ్ ఎవరెవరిని రీటైనింగ్ చేసుకోవచ్చు, చేసుకుంటే బాగుంటుందనే దానిపై అంతా చర్చిస్తున్నారు. ఈ క్రమంలో అందరి కళ్లు ముంబై ఇండియన్స్‌పైనే ఉంది. ముంబై టీమ్ ఎవరెవరు ఆటగాళ్లను రీటైన్ చేసుకోనుందనేది ఇప్పుడు కీలకంగా ఉంది. తాజాగా మాజీ క్రికెటర్ అజయ్ జడేజా కూడా ముంబై ఇండియన్స్ ఎవరిని రీటైన్ చేసుకోవాలి అన్న అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఎవరిని రీటైన్ చేసుకున్నా చేసుకోకపోయినా ముగ్గురు ఆటగాళ్లను మాత్రం ముంబై ఇండియన్స్ ఎట్టిపరిస్థితుల్లో వదులుకోకూడదని, వారిని వదులు కుంటే MI చిక్కుల్లో పడుటం పక్కా అని అంటున్నాడు. ఆ ముగ్గురు మరెవరో కాదు ఇన్నాళ్లూ ముంబై ఇండియన్స్‌కు మూలస్తంభాలుగా ఉన్న రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా. తప్పిదాలి వీరి పేర్లు గనుక వేలంలోకి వెళ్తే వారిని తిరిగి దక్కించుకోవడం ముంబైకి అసాధ్యమే అవుతుందని అంటున్నాడు అజయ్ జడేజా.
‘‘రోహిత్, బుమ్రా, సూర్యకుమార్‌ను ముంబై ఇండియన్స్(Mumbai Indians) కచ్ఛితంగా రీటైన్ చేసుకుంటుంది. ఒకవేళ వాళ్లు ఒక్కసారి వేలంలోకి వెళ్లారంటే వారిని తిరిగి పొందడం అసాధ్యం. హార్దిక్ పాండ్యా కోసమయితే MI తన రైటు టు మ్యాచ్ కార్డును వినియోగించొచ్చు. హార్దిక్ లాంటి ఆటగాడిని కూడా తిరిగి దక్కించుకోవడం చాలా కష్టం. కానీ తరచుగా గాయాలపాలవడమే పాండ్యాకు ఉన్న మైనస్. దాని వల్లే ఇతర ఫ్రాంఛైజీలు అతడి కోసం అంతమొత్తంలో ఖర్చు చేయడం చాలా కష్టం. ఆర్‌టీఎం ఉంటే దాన్ని బాగా వినియోగించుకోవాలి. అంతేకాని ఇది ఆటగాడి సామర్థ్యం లేదా శక్తిని నిర్ణయిస్తుందని నేను చెప్పట్లేదు’’ అని అజయ్ జడేజా వివరించాడు.