IND vs AUS |విశాఖ వన్డేలో టీమిండియా ఘోర పరాజయం

-

IND vs AUS |విశాఖ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘోర పరాభవం పాలైంది. అన్ని విభాగాల్లో రెచ్చిపోయి ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ఏకంగా పది వికెట్ల తేడాతో టీమిండియా ఓటమిని మూటగట్టుకుంది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా బ్యాటర్లను ఎవర్నీ ఆసీస్ బౌలర్లు క్రీజులో సరిగా కుదురుకోనివ్వలేదు. రోహిత్, గిల్, సూర్యకుమార్ యాదవ్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా ఎవరూ పెద్దగా ఆకట్టుకోలేదు. క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన విరాట్ కోహ్లీ, జడేజా కూడా ఎక్కువ సేపు ఆడలేదు. దీంతో టీమిండియా కేవలం 117 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు మాత్రం చెలరేగారు. టీ20 తరహాలో ఆడుతూ భారత బౌలర్లను ఒక ఆట ఆడేసుకున్నారు. ఇద్దరూ వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. దీంతో కేవలం 11 ఓవర్లలోనే ఆస్ట్రేలియా జట్టు ఒక్కటంటే ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది(IND vs AUS).

- Advertisement -
Read Also: అమాయకుల ప్రాణాలే పోతున్నాయి: కిషన్ రెడ్డి

Follow us on: Google News   Koo

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jagapathi Babu | రేవతి కుటుంబాన్ని నేను పరామర్శించా: జగపతిబాబు

Jagapathi Babu | సంధ్య థియేటర్ ఘటన రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా...

Prashanth Neel | ‘సలార్-1’ సక్సెస్‌పై ప్రశాంత్ నీల్ హాట్ కామెంట్స్..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా ప్రశాంత్ నీల్(Prashanth Neel) డైరెక్ట్...