అమాయకుల ప్రాణాలే పోతున్నాయి: కిషన్ రెడ్డి

0
Kishan Reddy

Kishan Reddy |సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో చోటు చేసుకున్న అగ్ని ప్రమాద ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. సికింద్రాబాద్ ప్యారడైజ్ ప్రాంతంలోని బట్టల షాపులతోపాటు, పలు ప్రైవేట్ ఆఫీసులకు నిలయమైన స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు మరణించిన సంగతి తెలిసిందే. తాజాగా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ప్రమాదం జరిగిన స్వప్పలోక్‌ కాంప్లెక్స్‌(Swapnalok Complex)ను ఆదివారం సందర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్న మంత్రి అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై మండిపడ్డారు. రాష్ట్రంలో జరగుతోన్న ప్రమాదాల్లో పేదలు, అమాయకులే ప్రాణాలు పోతున్నారు. ప్రమాదాలు సంభవిస్తున్నప్పటికీ ప్రమాదాలకు కారకులైన వారిపై జీహెచ్‌ఎంసీ చర్యలు తీసుకోవడం లేదు. ప్రమాదం జరిగినప్పుడు చర్యలు తీసుకుంటామంటున్నారు.. ఆ తర్వాత మర్చిపోతున్నారు. ప్రమాదాల నివారణకు అవసరమైన సామగ్రి కూడా అందుబాటులో ఉండట్లేదని కిషన్‌ రెడ్డి(Kishan Reddy) విమర్శించారు.

Read Also: చర్లపల్లి జైలు నుంచి నిహారిక విడుదల!

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here