Naveen Murder Case |చర్లపల్లి జైలు నుంచి నిహారిక విడుదల!

0
Naveen Murder Case

Naveen Murder Case |తెలంగాణలో గత ఫిబ్రవరి 17వ తేదీన నల్గొండ జిల్లాకు చెందిన బీటెక్‌ విద్యార్థి నవీన్‌ను అతని స్నేహితుడు హరిహర కృష్ణ హత్య చేసిన తీరు తెలంగాణలో సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నవీన్ ప్రియురాలు అయిన నిహారికకు రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో నిహారిక ఆదివారం జైలు నుంచి బయలకు వచ్చింది. ఈ కేసులో ప్రథాన నిందితుడు హరిహర కృష్ణ ఏ1, అతని స్నేహితుడు హాసన్‌ ఏ2, ప్రియురాలు నిహారిక ఏ3 నిందితులుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఫోన్‌లలోని కీలక సమాచారాన్ని తొలగించినందుకు నిహారిక, హాసన్‌లను పోలీసులు తొలుత అరెస్టు చేశారు. ఆ తర్వాత విచారణలో నిహారిక, హాసన్‌లు హత్యకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 14 రోజుల జ్యుడిషియల్‌ రిమాండ్‌ అనంతరం ఆమెకు కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. మరోవైపు నవీన్ హత్యకు(Naveen Murder Case) సంబంధించిన విచారణ కొనసాగుతూనే ఉంది.

Read Also: మిచెల్ స్టార్క్ ధాటికి కుప్పకూలిన భారత్‌

Follow us on: Google News  Koo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here