మిచెల్ స్టార్క్ ధాటికి కుప్పకూలిన భారత్‌

0
IND vs AUS

IND vs AUS |విశాఖ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డే మ్యాచ్‌లో టీమిండియా 117 పరుగులకే ఆలౌటైంది. కంగారూలపై సొంతగడ్డపై టీమిండియా సాధించిన అతిచిన్న స్కోరు ఇదే కావడం గమనార్హం. అక్షర్ పటేల్ 29, విరాట్ కోహ్లీ(31) తప్పా ఎవరూ రాణించలేదు. చివరి వికెట్‌గా మహ్మద్ సిరాజ్ (0) ఔటయ్యాడు. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌ దిగిన టీమిండియా జట్టులోని నలుగురు బ్యాట్స్‌మెన్స్ ఖాతా కూడా తెరవలేకపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 13, రవీంద్ర జడేజా 16 పరుగులు చేశారు. ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కంగారూల నుంచి అత్యధికంగా 5 వికెట్లు పడగొట్టాడు. సీన్ అబాట్ మూడు వికెట్లు, నాథన్ ఎల్లిస్ రెండు వికెట్లు తీశారు.

Read Also: Delhi Liquor Scam లో ఊహించని ట్విస్ట్ ఇచ్చిన ఈడీ

Follow us on: Google News  Koo

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here