India vs England |వైజాగ్‌లో జరిగిన రెండో టెస్ట్‌లో రోహిత్ సేన ఇంగ్లండ్ జట్టుపై ఘన విజయం సాధించింది. 399 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన ఇంగ్లీష్ జట్టు.. రెండో ఇన్నింగ్స్‌లో 292 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో భారత్ 106 పరుగుల తేడాతో గెలుపొందింది. ఓవర్‌నైట్ స్కోరు 67/1 పరుగులతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లండ్‌ను ఆదిలోనే బుమ్రా దెబ్బ తీశాడు. క్రాలే 132 బంతుల్లో 8 ఫోర్లు, సిక్సర్ తో 73 పరుగులు చేశాడు. బెన్ ఫోక్స్(36), టామ్ హార్ట్లీ(36) పోరాడారు. అయితే వీరిని బుమ్రా అవుట్ చేయడంతో మ్యాచ్ భారత్ వైపు మళ్లింది. దీంతో మిగిలిన వికెట్లను చకచకా తీయడంతో భారత్ గెలుపొందింది.
బుమ్రా, అశ్విన్ మూడేసి వికెట్లు, కుల్దీప్ యాదవ్, ముఖేశ్ కుమార్, అక్షర్ పటేల్ తలో వికెట్ దక్కించుకున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396, ఇంగ్లండ్ 253 పరుగులు చేశాయి. సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ 255 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో యశిస్వి జైస్వాల్ డబుల్ సెంచరీతో అదరగొట్టగా.. రెండో ఇన్నింగ్స్‌లో శుభ్‌మన్ గిల్ సెంచరీతో రాణించాడు. మ్యాచులో 9 వికెట్లు పడగొట్టి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన బుమ్రాకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలిచాయి. మూడో టెస్ట్ మ్యాచ్ రాజ్‌కోట్‌లో ఈనెల 15న ప్రారంభమవుతుంది.
India vs England | మరోవైపు ఈ మ్యాచులో స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్ జట్టుపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా కొత్త చరిత్ర లిఖించాడు. అంతకుముందు 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్ల చంద్రశేఖర్ తొలిస్థానంలో ఉన్నాడు. తాజాగా అశ్విన్ 38 ఇన్నింగ్స్‌ల్లో 96 వికెట్లతో ఆ రికార్డును తన పేరిట నమోదుచేసుకున్నారు.