భారత్-న్యూజిలాండ్(IND vs NZ) మధ్య జరిగిన రెండో టెస్ట్‌లో కివీస్ ఘన విజయం సాధించింది. సొంతగడ్డపై తిరుగలేని ఆధిపత్యం చెలాయిస్తున్న భారత్‌కు కివీస్ బ్రేకులు వేసింది. ఎవరూ ఊహించని రీతిలో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. పూణె వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో 113 పరుగుల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో ఏడు వికెట్లతో భారత బ్యాటర్లను హడలెత్తించిన శాంట్నర్.. రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి అదగొట్టాడు. ఈ మ్యాచ్‌లో కూడా విజయం సాధించడంతో భారత్‌తో జరిగిన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవలం చేసుకుంది కివీస్. భారత్ పర్యటనకు వచ్చి టెస్ట్ సిరీస్ గెలవడం కివీస్‌కు ఇదే తొలిసారి. 2012 నుంచి వరుసగా 18 టెస్ట సిరీస్‌లలో భారత్ విజయం సాధిస్తూ వస్తోంది. టీమిండియా టెస్ట్ విన్నింగ్ స్ట్రీక్‌కు న్యూజిలాండ్ బ్రేకులు వేసింది. న్యూజిలాండ్-భారత్ మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ నవంబర్ 1 నుంచి ముంబై వేదికగా ప్రారంభం కానుంది.
IND vs NZ | మూడో రోజు ఆటను 198/5 స్కోరుతో ప్రారంభించిన న్యూజిలాండ్ 255 పరుగులకు ఆలౌటైంది. ఈ క్రమంలో తొలి ఇన్నింగ్స్‌లో లభించిన 103 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకుని భారత్‌కు 359 పరుగుల లక్ష్యాన్ని ఇచ్చింది కివీస్. వెంటనే రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమిండియా 34 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. లంచ్ బ్రేక్ సమయానికి 27/1గా భారత్ స్కోర్ ఉండటంతో గెలిచే అవకాశం ఉందని అందరూ అనుకున్నారు. కానీ రెండో సెషల్‌లో భారత్ ఓటమి దిశగా పయణించడం మొదలైంది. ప్రతి ఒక్కరూ ఎంతగా ప్రయత్నించినా 245 పరుగులకే అన్ని వికెట్లు కోల్పోయింది.
మ్యాచ్ స్కోర్లు ఇలా
తొలి ఇన్నింగ్స్
కివీస్ – 259/10
భారత్ – 156-10
రెండో ఇన్నింగ్స్
న్యూజిలాండ్ – 255/10
భారత్ – 245/10