Champions Trophy | కంగారూలకే కంగారు పుట్టించిన కోహ్లీ

-

ఛాంపియన్స్ ట్రోఫీ-2025లో(Champions Trophy) టీమ్ భారత్ ఫైనల్స్‌కు చేరింది. సెమీ ఫైనల్స్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత ఆటగాళ్లు అదరగొట్టారు. స్టారింగ్ అంతంత మాత్రమే అనిపించుకున్నా.. గేమ్ రానురాను చాలా ఇంట్రస్టింగ్‌గా సాగింది. చివరకు ఆస్ట్రేలియాను నాలుగు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. ఈ గేమ్‌లో కూడా విరాట్ కోహ్లీ బాగా రాణించాడు. 84 పురుగులు చేశాడు. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. 49.3 ఓవర్లలో 10 వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో టీమిండియా.. 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకున్నట్లయింది.

- Advertisement -

Champions Trophy | 265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ తనదైన సెటిల్డ్ గేమ్‌తో విజయం సాధించింది. ఓపెనర్స్‌గా రోహిత్ శర్మ 29 బంతుల్లో 28 పరుగులు, అక్షర్ పటేల్ 30 బంతుల్లో 27 పరుగులు చేసి పర్వాలేనిపించారు. ఆ తర్వాత క్రీజ్‌లోకి అడుగు పెట్టిన విరాట్ కోహ్లీ 98 బంతుల్లో 84 పరుగులు చేసి టీమిండియా గెలుపులో కీలక పాత్ర పోషించాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ 62 బంతుల్లో 45 పరుగులు చేశాడు. కేఎల్ రాహుల్ 34 బంతుల్లో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో టీమిండియా ఫైనల్స్‌కు చేరిపోయింది.

Read Also: అమెరికాకి కౌంటర్ షాకిచ్చిన చైనా

Follow Us : Google News, Twitter, Share Chat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

బిగ్ బ్రేకింగ్… మహేష్ బాబుకి ఈడీ నోటీసులు

టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబుకి(Mahesh Babu) బిగ్ షాక్ తగిలింది....

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...