IPL 2023 ఆరంభ వేడుకలు అదుర్స్ అనిపించాయి. గుజరాత్ అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐపీఎల్ ప్రారంభ వేడుకలు శుక్రవారం అట్టహాసంగా జరిగాయి. సౌత్ లేడీ సూపర్ స్టార్ అయిన తమన్నా, రష్మికా మందన్నా మాస్ స్టెప్పులతో క్రీడాభిమానులను ఊర్రూతలూగించారు. అంతేగాక, బాలీవుడ్ పాపులర్ సింగర్ అర్జిగ్ సింగ్ తన అద్భుత పాటలతో అభిమానుల్లో ఊపుతెచ్చాడు. మిల్కీ బ్యూటీ తమన్నా.. టమ్ టమ్ అంటూ ట్రెండింగ్ సాంగ్‌కు మాస్ డ్యాన్స్‌తో పాటు పుష్ప సినిమాలోని ఊ అంటావా మామా అంటూ ఫ్యాన్స్‌ను మైమరిపించింది. అనంతరం నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. పుష్ప సినిమాలోని సామీ సామీ సాంగ్, ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటుకు డ్యాన్సులతో కేక పుట్టించింది.
- Advertisement -
Read Also: ఉస్మానియా యూనివర్సిటీలో బలగం సినిమా ప్రదర్శన
Follow us on: Google News, Koo, Twitter