IPL 2023 షెడ్యూల్ విడుదల

-

IPL 2023 Schedule: క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ మేరకు బీసీసీఐ శుక్రవారం ప్రకటన విడుదల చేసింది. భారత్ వేదికగానే ఈ ఏడాది ఐపీఎల్ మ్యాచ్‌లన్నీ జరగనున్నాయి. మార్చి 31 నుంచి ఐపీఎల్ 2023 సీజన్ మ్యాచ్‌లు ప్రారంభంకానున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్‌, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య అహ్మదాబాద్ వేదికగా మొదటి మ్యాచ్‌ జరుగనుంది. ఏప్రిల్ 2వ తేదీన రాజస్థాన్ రాయల్స్‌తో సన్ రైజర్స్ హైదరాబాద్ ఫస్ట్ మ్యాచ్ జరుగనుంది. ఈసారి గౌహతి, ధర్మశాల కూడా కొన్ని మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. ఏప్రిల్ 2న ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు రాత్రి 7:30 గంటలకి బెంగళూరులో ఢీకొనబోతున్నాయి. మే 21న లీగ్ దశ ఆఖరి మ్యాచ్ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం 70 లీగ్ మ్యాచ్‌లు ఉండనున్నాయి. పది జట్లు పాల్గొనబోయే ఈ టోర్నీలో డబుల్ హెడర్స్ (శని, ఆదివారాలలో) ఉన్నప్పుడు మ్యాచ్‌లు మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభమవుతాయి. మిగిలిన రోజుల్లో రాత్రి 7.30 గంటలకు మొదలవుతాయి. ప్రతీ జట్టూ 14 మ్యాచ్‌లు ఆడనుంది.

- Advertisement -

Read Also:

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...