మరో రెండు రోజుల్లో వరల్డ్ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. జూన్ 7 నుంచి లండన్‌లోని ఓవల్ వేదికగా జరగనున్న ఈ పోరులో ఆస్ట్రేలియా, ఇండియా జట్లు సమరానికి సిద్దమయ్యాయి. ఇప్పటికే ఇరు జట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఈ మ్యాచులో ఎలాగైనా గెలిచి ప్రపంచ ఛాంపియన్లుగా నిలవాలని భావిస్తున్నారు. అయితే ఈ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత్‌కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఇండియా ఆటగాడు ఇషాన్ కిషన్(Ishan Kishan) ప్రాక్టీస్ సెక్షన్‌లో గాయపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా ఇషాన్ చేతికి బంతి బలంగా తాకింది. దీంతో నొప్పితో విల్లావిల్లాడిన అతడు తర్వాతి ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనలేదు. మరి గాయం తీవ్రత ఎక్కువగా ఉంటే మాత్రం జట్టులో చోటు దక్కడం కష్టమే. ఒకవేళ జట్టులో ఇషాన్(Ishan Kishan) లేకపోతే తెలుగు ఆటగాడు శ్రీకర్ భరత్(Srikar Bharat) ఆ స్థానాన్ని భర్తీ చేస్తాడు.