Imam Ul Haq | ఇండియాలో మ్యాచ్ ఆడితే ఆ కిక్కే వేరు: పాకిస్తాన్ ఓపెనర్

-

పాకిస్తాన్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(Imam Ul Haq) సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘ఇండియాలో ఇండియాతో మ్యాచ్ అంటే చాలా స్పెషల్. నేను బాబర్ ఆజమ్(Babar Azam), ఈ విషయం గురించి 2010లో మాట్లాడుకున్నాం. ఇండియాలో మ్యాచ్ ఆడితే ఆ వాతావరణం, ప్రేక్షకుల గోలలు.. ఆ ఫీల్ ఎలా ఉంటుందో చాలాసార్లు విన్నాం. దాన్ని అనుభూతి చెందడానికి ఆతృతగా ఎదురుచూస్తున్నాం.. ఇప్పుడున్న పాకిస్తాన్ టీమ్, చాలా అద్భుతంగా సెట్ అయిందని నా అభిప్రాయం. 2019 వన్డే వరల్డ్ కప్‌లో ఆడిన పాకిస్తాన్ టీమ్‌ కాంబినేషన్‌లాగే అనిపించినా, అప్పటికీ ఇప్పటికీ చాలా మారింది. ప్లేయర్లకు అవకాశాలు ఇస్తూ ఉంటేనే స్టార్లు తయారు అవుతారు. పాకిస్తాన్‌లో 350 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా ఛేదించాం. సౌతాఫ్రికాలో 330 పరుగుల స్కోరు చేసి, సిరీస్ కూడా గెలిచాం. టీమ్‌లో ప్రతీ ఒక్కరూ కూడా వన్డే వరల్డ్ కప్ 2023 కోసం ఎదురుచూస్తున్నారు. కానీ కాస్త ప్రెషర్ కూడా ఉంది. ఇండియాలో మ్యాచ్ అంటే ఆ మాత్రం ఒత్తిడి ఉండడం కామన్. అందులో దాచాల్సింది ఏదీ లేదు. అయితే ఈ జట్టు అద్భుతాలు చేయగలదు. ఇండియాలో వన్డే వరల్డ్ కప్ గెలిస్తే, అది పాకిస్తాన్ టీమ్‌కి చాలా గర్వకారణం.. మేం దాన్ని సాధించగలమనే నమ్ముతున్నాం’ అంటూ పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్(Imam Ul Haq) కామెంట్స్ చేశాడు.

- Advertisement -
Read Also:
1. మహారాష్ట్ర రాజకీయాల్లో సంచలనం.. ఉప ముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌

Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kishan Reddy | రేవంత్ ఛాలెంజ్‌కు కిషన్ రెడ్డి ఓకే

Kishan Reddy - Revanth Reddy | పాలనపై చర్చకు వచ్చే...

Revanth Reddy | మోదీ మాటొకటి.. బండిదొకటి: రేవంత్

బీసీ నేతలతో సమావేశం అయిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy)...