గత కొన్ని రోజులుగా టీమిండియా ప్లేయర్ కేఎల్ రాహుల్(KL Rahul)పై సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా.. ఈ ట్రోలింగ్‌పై రాహుల్ స్పందించాడు. ట్రోలింగ్(Trolls)ను తాము ఏమాత్రం పట్టించుకోకపోయినా తమపై ప్రభావం చూపుతోందని ఆవేదన చెందాడు. తమపై అభిమానులు అధికారం ఉన్నట్లుగా వ్యవహరిస్తున్నారని వాపోయాడు. ఆ వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని అస్సలు ఆలోచించడం లేదని తెలిపాడు. ప్రపంచంలో ఏ క్రీడాకారుడు కూడా చెత్తగా ఆడాలని కోరుకోడు. క్రికెటే నా జీవితం. నాకు క్రికెట్ తప్ప ఏం తెలియదు అంటూ రాహుల్ ఎమోషనల్ అయ్యాడు. తాను తన ఆటపై సీరియస్‌గా లేనని, కష్టపడటం లేదని ఎవరైనా ఎలా అంటారు?.. స్పోర్ట్స్‌లో కష్టానికి తగిన ఫలితం వచ్చే అవకాశం ఉండదు. తాను ఎంత కష్టపడినా.. ఫలితం అనుకూలంగా రాకపోవచ్చు అని రాహుల్(KL Rahul) చెప్పుకొచ్చాడు. కాగా, గాయం కారణంగా ఐపీఎల్-16 సీజన్‌కు మధ్యలోనే దూరమైన అతను ఇటీవల శస్త్రచికిత్స చేయించుకున్నాడు.
Read Also: అదిరిపోయిన పవన్ ‘బ్రో’లుక్.. అభిమానులకు పునకాలు షురూ
Follow us on: Google News, Koo, Twitter