బంగ్లాదేశ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌కు భారత జట్టులో సర్ఫరాజ్(Sarfaraz Khan)కు స్థానం ఖరారైంది. ఈ నేపథ్యంలోనే చెన్నైలో అతడు టీమిండియాతో కలిశాడు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ మాట్లాడుతూ.. రెండు విషయాల్లో కోహ్లీకి ఎవరూ పోటీ రారని అన్నాడు సర్ఫరాజ్. కోహ్లీతో తనకు మంచి అనుబంధం ఉందని చెప్పిన సర్ఫరాజు.. రెండే రెండు విషయాల్లో గ్రేటెస్ట్ ప్లేయర్లు కూడా కోహ్లీ ముందు దిగదుడుపేనని అన్నాడు. ఐపీఎల్‌లో కోహ్లీ సారథ్యంలో ఆడిన సందర్భంగా కోహ్లీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నానని, కోహ్లీ లాంటి ఆటగాడు మరొకడు దొరకడం చాలా కష్టమని అన్నాడు. క్రీజ్‌లో ఉండే కోహ్లీ, బెంచ్‌పై ఉండే కోహ్లీ వేరని, రెండు చోట్ల రెండు వ్యక్తిత్వాలు కనిపిస్తాయని అన్నారు. మైదానంలో ఒక యోధుడిలా ఉండే కోహ్లీ ఒక్కసారి బెంచ్ దగ్గరకు వెళ్లాక ఒక క్రికెట్ డైహార్ట్ ఫ్యాన్‌లా మారిపోతాడు.. ప్రతి ఒక్కరినీ చీర్ చేస్తుంటాడని చెప్పాడు సర్ఫరాజ్.
‘‘క్రికెట్ గురించి తెలియడం, ఆత్మవిశ్వాసం విషయంలో కోహ్లీ(Kohli)కి ఎవరూ సాటిలేరు. రారు. కోహ్లీ ఎప్పుడూ యువ ఆటగాళ్లకు సపోర్ట్‌గా ఉంటాడు. వాళ్లకి పలు సూచనలు ఇస్తూ వారి ఆటతీరును మెరుగుపరచడానికి చూస్తుంటాడు. అంతేకాకుండా మ్యాచ్‌కు ముందే పలానా బౌలర్ బౌలింగ్‌లో ఇన్ని పరుగులు చేస్తానని చెప్తాడు. మాకు కూమా దానిని అలవాటు చేశాడు. అలా చెప్పడం వల్ల మనం ఆ టార్గెట్ రీచ్ అవ్వడానికి శతవిధాలా ప్రయత్నిస్తాం. ఒకవైపు వికెట్‌ను కాపాడుకుంటానే మరోవైపు స్కోర్ చేయడానికి ఉత్సాహం చూపుతాం. అదే మంత్రాన్ని కోహ్లీ పాటిస్తాడు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా అందరి ముందు నిలబడి మాట్లాడతాడు. చెప్పిన విషయాన్ని తర్వాత రోజే చేసి చూపిస్తాడు. ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదు’’ అని సర్ఫరాజ్(Sarfaraz Khan) చెప్పుకొచ్చాడు.