ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా ఐదు ఐపీఎల్ ట్రోఫీలు నెగ్గి చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ(Rohit Sharma).. ఓ చెత్త రికార్డును కూడా తన పేరు మీద నమోదుచేసుకున్నాడు. శనివారం మధ్యాహ్నం చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ డకౌట్ అయ్యాడు. దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యధిక సార్లు డకౌట్ అయిన బ్యాటర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌లో ఇప్పటివరకు రోహిత్ 16సార్లు సున్నా పరుగులకే ఔటయ్యాడు. రోహిత్ తర్వాత కేకేఆర్(KKR) జట్టు ఆటగాడు సునీల్ నరైన్(15), మన్‌దీప్ సింగ్ (15), ఆర్సీబీ(RCB) ప్లేయర్ దినేశ్ కార్తీక్(15) ఉన్నారు.
ఇదేకాకుండా మరో చెత్త రికార్డునూ తన ఖాతాలో వేసుకున్నాడు రోహిత్ శర్మ(Rohit Sharma). అదేటంటే ఐపీఎల్‌లో అత్యధిక సార్లు సున్నా పరుగులకే ఔట్ అయిన కెప్టెన్‌గానూ(11) నిలిచాడు. ఈ ఐపీఎల్(IPL) సీజన్ లో వరుసగా విఫలమవుతున్నా రోహిత్ ఇకనైనా తన ఆటతీరుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉందని మాజీ ఆటగాళ్లు అభిప్రాయపడుతున్నారు.
Read Also: మరోసారి విజయ్ దేవరకొండను టార్గెట్ చేసిన అనసూయ
Follow us on: Google News, Koo, Twitter