Harbhajan Singh |మిస్టర్ కూల్ కెప్టెన్ ఎవరు అనగానే.. అందరికి టక్కున గుర్తొచ్చే పేరు ఎమ్ఎస్ ధోనీ. మైదానంలో ధోనీ కోపంగా గానీ, ఎమోషనల్ గానీ ఉండటం చాలా అరుదు. ఎంత ఒత్తిడి ఉన్నా చాలా కూల్‌గా జట్టును నడిపిస్తుంటాడు. కానీ ఓ సందర్భంలో ధోనీ కన్నీరు పెట్టుకున్నాడట. తాజాగా ఓ క్రీడా ఛానల్ షోలో పాల్గొన్న టీమిండియా మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్(Harbhajan Singh) ఈ విషయాన్ని బయటపెట్టాడు. ‘మీతో నేను ఓ విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. రెండేళ్ల నిషేధం తర్వాత 2018లో చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్‌లోకి తిరిగి వచ్చింది. ఆ సందర్భంలో ఏర్పాటు చేసిన టీమ్ డిన్నర్‌లో ధోనీ(MS Dhoni) కన్నీరు పెట్టుకున్నాడు. అతడు చాలా భావోద్వేగానికి గురయ్యాడు. దీని గురించి ఎవరికీ తెలియదని అనుకుంటున్నాను. నిజమే కదా? ఇమ్రాన్ తాహిర్?’ అని హర్భజన్ చెప్పాడు. అదే షోలో పాల్గొన్న సీఎస్కే మాజీ క్రికెటర్ ఇమ్రాన్ తాహిర్ స్పందిస్తూ..‘నేను కూడా అక్కడే ఉన్నా. అతనికి చాలా ఎమోషనల్ మూమెంట్. అప్పుడు జట్టు అతనికి ఎంత దగ్గరగా ఉందో నాకు తెలిసింది. ధోనీ ఎమోషనల్ అవడం అక్కడ ఉన్నవారందరిని భావోద్వేగానికి గురిచేసింది’ అని తాహిర్ చెప్పుకొచ్చాడు.
‘MS ధోనీ కన్నీరు పెట్టుకున్నప్పుడు నేను పక్కనే ఉన్నా’
-