YS అవినాశ్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు KA పాల్ మద్దతు

-

ఎంపీ అనివాష్‌ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేస్తూ తెలంగాణ హైకోర్టు నిర్ణయం తీసుకుంది. రేపు ఉదయం 10:30 గంటలకు అందరి వాదనలు వింటామన్న హై కోర్టు తెలిపింది. ఇదిలా ఉంటే వాదనలకు ఎంత సమయం పడుతుందనీ సీబీఐని ముందు హైకోర్టు అడిగింది. గంట పాటు వాదనలు వినిపిస్తున్నామన్న సీబీఐ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో విచారణను రేపటికి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయాన్ని వెలువరించింది. ఇదిలా ఉంటే.. వైఎస్ అవినాశ్ రెడ్డి(Avinash Reddy)కి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్(KA Paul) మద్దతు ప్రకటించారు. అవినాష్ రెడ్డిని అన్యాయంగా దోషిగా చిత్రీకరిస్తున్నారని పాల్ వ్యాఖ్యానించారు.
వివేకాకు న్యాయం జరగాలని.. అదే సమయంలో.. నిర్దోషులను కాపాడాలని స్పష్టం చేశారు. కర్నూలులో చికిత్స పొందుతున్న అవినాష్ తల్లిని కేఏ పాల్ గురువారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నేను టర్కీ ప్రెసిడెంట్ గెలుపు కోసం బాగా కృషి చేస్తున్నా. మే 28న ఎలక్షన్ ఉంది. నేను ఇప్పుడు టర్కీలో ఉండాలి. కానీ.. విమలా రెడ్డి వీడియో చూసినప్పుడు చాలా హార్ట్ టచింగ్‌గా అనిపించింది. ఎవరు ఈ విమలా రెడ్డి అని చూస్తే.. రాజారెడ్డి కూతురు అని తెలిసింది. ఆసుపత్రిలో ఉన్న లక్ష్మి, విమలా రెడ్డి గతంలో నా శాంతి సభలకు హాజరయ్యారు. ఇప్పుడు లక్ష్మి చాలా స్ట్రెస్‌లో ఉంది. దీనిపై మీడియాలో రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు’ అని పాల్(KA Paul) వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మందుబాబులకు షాక్.. మూడు రోజులు మద్యం షాపులు బంద్..

Liquor Shops | తెలుగు రాష్ట్రాల్లో ఓవైపు ఎండలు మండిపోతున్నాయి. వేసవి...

AB Venkateswara Rao | ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట.. సస్పెన్షన్ ఎత్తివేత

సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకు(AB Venkateswara Rao) ఊరట దక్కింది....