రంజీ ట్రోఫీ ఫైనల్ లో ముంబయి Vs మధ్యప్రదేశ్..టైటిల్​ గెలిచేదెవరు?

0
119

రంజీ ట్రోఫీ 2022 సీజన్ చివరి అంకానికి చేరుకుంది. నేటి ఫైనల్​లో​ ముంబయి- మధ్యప్రదేశ్ తలపడనున్నాయి. ఇప్పటికే రికార్డు స్థాయిలో 41 సార్లు టైటిల్​ గెలుచుకున్న ముంబయి..ఒకవైపు  23ఏళ్ల తర్వాత తుదిపోరుకు చేరుకున్న మధ్యప్రదేశ్​ మరోవైపు. దీనితో ఫైనల్ మ్యాచ్ వేరే లెవల్ లో వ్ ఉండబోతుంది. మరి ఆ రెండు జట్ల బలాలు, బలహీనతలు ఏంటో ఇప్పుడు చూద్దాం..

కాగితంపై చూస్తే మధ్యప్రదేశ్ కన్నా ముంబై జట్టే బలంగా కనిపిస్తుంది. సర్ఫరాజ్​ ఖాన్ 803 పరుగులు చేసి సీజన్​లో అత్యధిక రన్స్​ చేసిన ఆటగాడిగా నిలిచాడు. యశస్వి జైశ్వాల్​.. రంజీ ట్రోఫీలో రెండే మ్యాచులు ఆడి ఏకంగా 413 పరుగులు చేశాడు. సువేద్​ పార్కర్ తన తొలి మ్యాచ్​లోనే డబుల్​ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లో షామ్స్​ ములాని, తనుష్​ కొటియన్​​ రాణిస్తున్నారు. ఇక ఓపెనర్​, దూకుడైన ప్లేయర్​ పృథ్వీ షా, అర్మాన్​ జాఫర్​ కూడా బాగా ఆడుతున్నారు.

మధ్యప్రదేశ్ జట్టుకు కీలకంగా ఉన్న ఆల్​రండర్​ వెంకటేశ్ అయ్యర్​, పేసర్​ అవేశ్​ ఖాన్​ అందుబాటులో లేకపోవడం ఒక్కటే ప్రతికూలాంశం. బ్యాటింగ్​లో హిమన్షు మంత్రి, అక్షత్​ రఘువంశీ కూడా బాగా ఆడుతున్నారు. ఐపీఎల్​లో ఆర్సీబీ తరఫున రజత్ పాటిదార్​.. అద్భుతంగా రాణించాడు. మరి రంజీట్రోఫీని అందుకునే జట్టేదో చూడాలి.