వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్‌లో ఓటమి తర్వాత సుదీర్ఘ విరామం తీసుకున్న టీమిండియా జూలై 12 నుంచి వెస్టిండీస్‌లో పర్యటించనుంది. ఈ నేపథ్యంలో వెస్టిండీస్‌తో తలపడే భారత వన్డే, టెస్టు జట్టును సెలక్టర్లు ప్రకటించారు. వన్డే జట్టులో పెద్దగా మార్పులు చోటు చేసుకోనప్పటికీ టెస్టు జట్టులో మాత్రం చోటు చేసుకున్నాయి. అనూహ్యంగా ఢిల్లీ పేసర్ నవదీప్ సైనీకి(Navdeep Saini) చోటు కల్పించారు. వెస్టిండీస్ పర్యటకు ఎంపిక అవుతానని తాను అస్సలు ఊహించలేదని సైనీ తెలిపాడు. రెండోసారి విండీస్ పర్యటనకు వెళ్లనుండడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చాడు. అయితే.. అప్పట్లో తనకు తుది జట్టులో స్థానం దక్కలేదని ఈసారి మాత్రం అవకాశం వస్తే సత్తా చాటుతానన్నాడు. నవదీప్ సైనీ(Navdeep Saini) 2019లో వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో టీమ్ఇండియా తరుపున అరంగ్రేటం చేశాడు. ఆ తరువాత రెండేళ్లకు బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2021 లో భాగంగా జనవరిలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో సైతం అడుగుపెట్టాడు. అదే అతడి చివరి సిరీస్. ఆ తరువాత మరోసారి టెస్టు మ్యాచ్ ఆడలేదు. దాదాపు రెండున్నరేళ్ల విరామం తరువాత ఎంపిక కావడం జరిగింది.
Read Also:
1. మెగా ప్రిన్సెస్‌కు గ్రాండ్ వెల్కమ్
Follow us on: Google News, Koo, Twitter, ShareChat