న్యూజిలాండ్‌తో జరిగిన టీ 20లో హాఫ్ సెంచరీ చేసిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ అజమ్ రికార్డుల వేటలో పడ్డాడు. టీమ్ ఇండియా స్టార్ ఆటగాళ్లైన విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ రికార్డులను సమం చేసి.. సత్తా చాటాడు. క్రైస్ట్ చర్చ్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో బాబర్ అంతర్జాతీయ టీ 20 కెరీర్‌లో 28వ హాప్ సెంచరీ పూర్తి చేశాడు. టీ 20ల్లో వేగంగా 28 హాఫ్ సెంచరీలు చేసిన ఘనత ఉన్న కోహ్లీ పేరిట ఉన్న రికార్డును సమం చేశాడు. ఆశ్చర్యర్యకరమైన విషయం ఏమిటంటే.. విరాట్, బాబర్ 84వ ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ సాధించటం. టీ 20లో చేధనలో 12 హాఫ్ సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ శర్మతో కలిసి సమంగా రికార్డు నెలకొల్పాడు. న్యూజిలాండ్‌తో రెండో టీ 20లో 148 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్థాన్.. ఇంకా 10 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని పూర్తి చేసింది.