IPL బెట్టింగ్ ముఠా అరెస్ట్.. భారీగా నగదు స్వాధీనం

-

ఊహించిన దానికంటే ఎక్కువగా ఐపీఎల్(IPL) మ్యాచులు రంజుగా మారుతున్నాయి. చివరి బాల్ వరకు ఏ జట్టు విజయం సాధింస్తుందో చెప్పలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ క్రమంలోనే బెట్టింగ్ దందాలూ జోరుగా సాగుతున్నాయి. తాజాగా.. హైదరాబాద్‌లో క్రికెట్‌ బెట్టింగ్‌(Cricket Betting) ముఠాను గుట్టురట్టు చేశారు పోలీసులు. క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.20 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అంతేగాక, బ్యాంక్ అకౌంట్లో ఉన్న 1.3 కోట్ల రూపాయలు, 7 మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. క్రికెట్‌ బెట్టింగ్‌కు పాల్పడుతోన్న ముగ్గురు నిందితులను మీడియాముందు ప్రవేశపెట్టారు రాచకొండ సీపీ. ఆన్లైన్ ద్వారా బెట్టింగులు కడుతూ…ఈ ముఠా సభ్యులు భారీగా డబ్బు గుంజుతున్నట్టు గుర్తించారు పోలీసులు. బెట్టింగ్‌(Cricket Betting) ముఠాలో ప్రధాన బుకీ ఏపీకి చెందిన పల్సర్ శ్రీనివాస్ రావు, సురేష్, హర్యానా‌కి చెందిన విపుల్ మొంగా పరారీలో ఉన్నారు. ఆన్ లైన్‌లో బెట్టింగ్ నిర్వహిస్తే ఉపేక్షించేది లేదన్నారు. అలాగే నకిలీ ఎజెంట్లతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

- Advertisement -
Read Also: జేడీ లక్ష్మీనారాయణపై విష్ణువర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...