యశస్వి జైశ్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్, జో రూట్ వంటి బలమైన బ్యాటింగ్ ఆర్డర్ ఉన్న రాజస్థాన్ రాయల్స్ జట్టు ఘోరంగా విఫలమైంది. ఆర్సీబీ(RCB) నిర్దేశించిన 172 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కేవలం 10.3ఓవర్లలో 59పరుగులకే కుప్పకూలింది. దీంతో ప్లే ఆఫ్స్ అవకాశాలను రాజస్థాన్ సంక్లిష్టం చేసుకుంది. హెట్‌మయర్(35) మినహా మిగిలిన బ్యాటర్లందరూ చేతులెత్తేశారు. సూపర్ ఫామ్‌లో ఉన్న యశస్వి జైస్వాల్(0)ని సిరాజ్ మొదటి ఓవర్లలోనే ఔట్ చేశారు. రెండో ఓవర్‌లో పార్నెల్ బట్లర్(0) వికెట్ తీయడంతో మ్యాచ్ బెంగళూరు చేతిలోకి వెళ్లిపోయింది. అప్పటినుంచి వరుస వికెట్లు తీస్తూ భారీ విజయం సాధించింది. ఆర్సీబీ బౌలర్లలో పార్నెల్ 3, బ్రాస్‌వెల్ 2, కర్ణ్ శర్మ 2 వికెట్లు తీశారు. బెంగళూరు జట్టు 112 పరుగుల భారీ తేడాతో గెలవడమే కాదు, రన్ రేట్ కూడా బాగా మెరుగుపర్చుకుంది. దీంతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలోకి దూసుకెళ్లింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ(RCB) బ్యాటర్లలో డుప్లెసిస్(55), మ్యాక్స్‌వెల్(54) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో అనుజ్ రావత్ (29) మెరుపులు మెరిపించడంతో బెంగళూరు 171/5 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో ఆసిఫ్, ఆడమ్ జంపా తలో రెండు వికెట్లు పడగొట్టగా.. సందీప్ శర్మ ఒక వికెట్ తీశాడు.
Read Also: అమ్మ నవ్వు చూస్తే అన్ని మర్చిపోతాం: చిరంజీవి
Follow us on: Google News, Koo, Twitter