ఛాంపియన్స్ ట్రోఫీ-2025 విజయం తర్వాత రోహిత్(Rohit Sharma) అభిమానులు అమాంతం పెరిగారు. రోహిత్‌తో ఫొటోలు దిగడం ఒక ప్రత్యేక ప్రివిలేజ్‌గా భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రోహిత్ తన కుమార్తె సమైరాను తీసుకుని కారులోకి ఎక్కడానికి వెళ్తుండగా అభిమానులు ఫొటోలు దిగడానికి ఎగబడ్డారు. ఫొటో గ్రాఫర్లు కూడా రోహిత్ తన ముద్దుల కుమార్తెతో కలిసి ఉన్న ఫొటోలు తీయడానికి పోటీ పడ్డారు. దీంతో రోహిత్ తీవ్ర అసహనానికిగురయ్యాడు. సమైరా ఫొటోలు తీయొద్దంటూ వారించాు. వెంటనే కుమార్తెను కారులో కూర్చోబెట్టాడు. ఆ తర్వాత కొద్దిసేపటికి కూల్ అయిన రోహిత్.. అభిమానులతో కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Also: ట్రూత్ సోషల్‌లోకి మోదీ ఎంట్రీ