ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మపై మాజీ టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ సునీల్ గవస్కార్(Sunil Gavaskar) కీలక వ్యాఖ్యలు చేశారు. రోహిత్ శర్మ కొంతకాలం ఐపీఎల్‌కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకోవడం ఉత్తమమని అభిప్రాయపడ్డారు. ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌నకు ముందు రోహిత్‌కు విశ్రాంతి అవసరమని తెలిపారు. రోహిత్(Rohit Sharma) ఐపీఎల్‌లో చివరి మూడు, నాలుగు మ్యాచ్‌లు ఆడితే సరిపోతుందని, డబ్ల్యుటీసీ ఫైనల్‌కు అతడు తాజాగా ఉండడం అవసరమన్నాడు. రోహిత్ కాస్త ఒత్తిడికి గురవుతున్నట్లు కనిపిస్తున్నది. ప్రస్తుతం అతడు వరల్డ్ టెస్ట్ చాంపియన్ షిప్(WTC) గురించి ఆలోచిస్తున్నాడు అనుకుంటా. అందుకే కాస్త విశ్రాంతి తీసుకొని పూర్తి సిద్ధంగా టెస్ట్ మ్యాచ్ రావాలి. అప్పుడే టీమిండియా మెరుగైన ఫలితాలు రాబడుతుందని గవస్కార్(Sunil Gavaskar) అన్నారు. కాగా, ఐపీఎల్ ఫైనల్ మే 28 తేదీన జరుగనున్నది. ప్రస్తుతం ముంబై ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది.
Read Also: ‘దక్షిణాది నుంచి తొలి సీఎంగా కేసీఆర్ రికార్డు సృష్టించడం ఖాయం’
Follow us on: Google News, Koo, Twitter