రోహిత్ శర్మ(Rohit Sharma) భార్య రితికా సజ్జే ఇటీవల పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ముఖ్యమైన క్షణాల కోసం హిట్ మ్యాన్.. ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లకుండా భారత్‌లోనే ఉన్నాడు. బిడ్డ పుట్టిన తర్వాత ఆస్ట్రేలియాకు పయనమయ్యాడు. కానీ ఇప్పటి వరకు తన బిడ్డకు సంబంధించి రోహిత్-రితిక దంపతులు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
దీంతో అభిమానులు కాస్తంత నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా వారి నిరాశను రితికా పటాపంచలు చేసేసింది. ఇన్‌గ్రామ్ వేదికగా తమ కుమారుడిని పేరును అనౌన్స్ చేసింది రితికా. క్రిస్మస్ వేడుకల స్టైల్లో రితికా.. చిన్నారి పేరును వెల్లడించింది.
నాలుగు క్రిస్మస్ బొమ్మలపై తమ పేర్లతో పాటు చిన్నారి పేరు కూడా రాసి ఉన్న ఫొటోను రితికా(Ritika Sajdeh) షేర్ చేసింది. తన రెండో బిడ్డకు ‘అహాన్’ అని నామకరం చేసినట్లు ఈ ఫొటో చూస్తే అర్థమవుతోంది. ప్రస్తుతం రితిక పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఆమె పోస్ట్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. హిట్ మ్యాన్(Rohit Sharma) కుమారుడి పేరు చాలా బాగుంది అని కొందరు, మా చిట్టి హీరో ఫొటోను కూడా పంచుకోండి అని మరికొందరు కోరుతున్నారు.