బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ ఘన విజయం సాధించింది. కాగా ఈ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్ రాహుల్‌కు అన్యాయం జరిగిందని, అతడికి కుదురుకోవడానికి ఇంకాస్త సమయం ఇచ్చి ఉంటే అద్భుత ప్రదర్శన కనబరిచి ఉండేవాడన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు సీనియర్ ఆటగాళ్లు. ఇదే విషయాన్ని ఆకాశ్ చోప్రా కూడా చెప్పారు. రోహిత్ శర్మ(Rohit Sharma).. డిక్లేర్ ఇవ్వకుండా ఉండాల్సిందని, ఇంకా రోజున్నర సమయం ఉన్నందున రాహుల్(KL Rahul)కు ఆడే ఆవకాశం ఇచ్చి ఉంటే ఇన్నింగ్స్ వేరేలా ఉండేదని ఆకాశ్ చోప్రా(Aakash Chopra) చెప్పుకొచ్చాడు. ఎటువంటి సమయంలో మ్యాచ్ ఆగే ప్రసక్తే లేదని అర్థమవుతున్నా రోహిత్ తొండరపడి డిక్లేర్ చేశాడని, అలా చేయకుండా ఉండి ఉండాల్సిందని ఆకాశ్ చెప్పుకొచ్చాడు.
‘‘ఇంకా రోజున్నర సమయం ఉంది. 280 పరుగుల విజయాన్ని భారత్ కౌవసం చేసుకుంది. అలాగని ఫాలోఆన్ కూడా ఆడించలేదు. సమయం లేదనుకోవడానికి లేదు.. వర్షం పడే ప్రమాదం లేదు. అన్ని కలిసి వస్తున్నప్పుడు రాహుల్‌కు ఇంకాస్త సమయం క్రీజ్‌లు ఉండనిచ్చి ఉంటే బాగుండేది. కనీసం 60-70 పరుగులు చేసేదాకైన ఆగి ఉంటే రాహుల్ కుదురుకునే వాడని, మరో రేంజ్ ఆటను చూపించే ఉండేవాడు. ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పుడు అతడికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. అలా చేయడం వల్ల మ్చాచ్‌పై కానీ, మేనేజ్‌మెంట్‌పై కానీ ఎటువంటి ప్రభావం పడే అవకాశం కూడా లేదు. టెస్ట్ మ్యాచ్‌లో కేవలం 19 బంతులు ఆడి 22 పరుగులు చేసి ఔట్ కాకుండానే డిక్లేర్ వల్ల ఒక దూకుడు మీద ఉన్న ఆటగాడు పెవిలియన్ చేరడం ఏమంత బాగాలేదు. రాహుల్‌కు నిజంగా కాస్త సమయం ఇచ్చి ఉండాల్సింది’’ అని ఆకాశ్(Aakash Chopra) అన్నాడు.