ఐపీఎల్ 17వ సీజన్‌కు రంగం సిద్ధమైంది. శుక్రవారం నుంచి ఐపీఎల్ కొత్త సీజన్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఈ సందర్భంగా 10 టీంల కెప్టెన్లు ఐపీఎల్ ట్రోఫీ ఫొటో షూట్‌లో పాల్గొన్నారు. అయితే సీఎస్కే కెప్టెన్‌గా ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) హాజరయ్యాడు. దీంతో అందరూ షాక్ అయ్యారు. అయితే ఈ సీజన్ నుంచి ధోనీ స్థానంలో గైక్వాడ్ సారథిగా వహించనున్నాడని ఐపీఎల్ నిర్వాహకులు తెలిపారు.
చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ కూడా ధోనీ(MS Dhoni) తన కెప్టెన్సీ పగ్గాలను రుతురాజ్ గైక్వాడ్‌కు అప్పగించాడని ట్వీట్ చేసింది. దీంతో ఇక నుంచి గైక్వాడ్(Ruturaj Gaikwad) కెప్టెన్సీ చేపట్టనున్నాడు. అయితే కొంతమంది సీఎస్కే, ధోనీ అభిమానులు మాత్రం దీనిని జీర్ణించుకోలేకపోతున్నారు. సీఎస్కే అంటే ధోనీ, ధోనీ అంటే సీఎస్కే అని గుర్తు చేసుకుంటున్నారు. 2008 నుంచి 2023 దాకా దాదాపు 14 సంవత్సరాలు సీఎస్కే కెప్టెన్‌గా ధోనీ వ్యవహరించాడు. ఇందులో 5 సార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపాడు. అయితే 40 ఏళ్లు పైబడటంతో ధోనీ ఐపీఎల్ నుంచి తప్పుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సీజన్‌లో మాత్రమే ఆడతాడని వచ్చే సీజన్ నుంచి రిటైర్మెంట్ తీసుకుంటాడని ఆయన సన్నిహితులు చెబుతున్నారు .
కాగా ఈసారి ఐపీఎల్‌లో తాను కొత్త పాత్రను పోషిస్తున్నానని ఇటీవల ధోనీ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు పెట్టాడు. దీంతో కెప్టెన్‌గా కాకుండా ఆటగాడిగా కొనసాగడం అని ఈ పోస్ట్ సారాంశం అని ఇప్పుడు అందరికీ అర్థమైంది.
Read Also: బీజేపీ మూడవ జాబితా విడుదల.. తమిళిసై పోటీ చేసే సెగ్మెంట్ ఇదే
Follow us on: Google News, Koo, Twitter, ShareChat