SA vs IND | రెండో టీ20లో చతికిలబడిన భారత బ్యాటర్లు

-

SA vs IND | దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత బ్యాటర్లు, బౌలర్ల చిచ్చరపిడుగుల్లా ఆడారు. ప్రత్యర్థులను బెంబేలెత్తించారు. ప్రతి ఒక్క బ్యాటర్ కూడా పరుగుల వర్షం కురిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్ల చేత మూడు చెరువుల నీళ్లు తాగించారు. కానీ రెండో టీ20 మ్యాచ్‌లో మాత్రం భారత బ్యాటర్లు తేలిపోయారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లు చతికిలబడ్డారు. తొలి మ్యాచ్‌లో సెంచరీతో చెలరేగిన సంజు(Sanju Samson) శాంసన్.. ఈ మ్యాచ్‌లో మాత్రం సున్నా పరుగులకే పెవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) నాలుగు పరుగులకే వికెట్‌ను సమర్పించుకున్నాడు.

- Advertisement -

SA vs IND | వన్ డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ సూర్యకుమార్‌ యాదవ్‌ (4) సైమ్‌లైన్‌ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. తిలక్‌ వర్మ 20 పరుగులతో సోసోగా రాణించాడు. ఇన్నింగ్స్‌ వేగం పుంజుకుంటున్న తరుణంలో అక్షర్‌ పటేల్‌ (27) రనౌట్‌గా పెవిలియన్‌కు చేరాడు. హార్దిక్ పాండ్యా 39 నాటౌట్ గా నిలిచాడు. దీంతో భారత జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేసింది.

Read Also: సమంతను చూస్తే భయమేసింది: వరుణ్ ధావన్
Follow us on: Google News, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...