న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్ సెకండ్ ఇన్నింగ్స్‌లో తన దూకుడు ఆటతో అదరగొట్టిన సర్ఫరాజ్(Sarfaraz khan).. అభిమానులకు మరో గుడ్ న్యూస్ చెప్పాడు. ఈ క్రికెటర్ భార్య సోమవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ఈ సంతోషకరమైన విషయాన్ని సర్ఫరాజ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు. దీంతో అభిమానులు, సహచర ఆటగాళ్లు అందరూ సర్ఫరాజ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. గతేడాది ఆగస్టులో రోమానా జహూర్‌తో సర్ఫరాజ్ వివాహమైంది.
ఇటీవల న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఈ 26 ఏళ్ల క్రికెటర్.. పరుగుల వరద కురిపించాడు. 150 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. తొలి ఇన్నింగ్స్‌లో అంతంత మాత్రంగానే రాణించినా సెకండ్ ఇన్నింగ్స్‌లో మాత్రం వీరవిహారం చేశాడు. తీవ్ర ఒత్తిడి పరిస్థితిలో మైదానంలోకి అడుగుపెట్టిన సర్ఫరాజ్(Sarfaraz khan).. పంత్‌తో కలిసి పరుగుల వరద కురిపించాడు.