లక్ష్యసేన్ ఔట్: క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లిన సాత్విక్ జోడీ

-

బ్యాడ్మింటన్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత స్టార్ పురుషుల జంట సాత్విక్‌ -చిరాగ్ శెట్టి(Satwik Chirag) క్వార్టర్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. గురువారం జరిగిన ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో సాత్విక్ జోడీ 21-15, 19-21, 21-9 తేడాతో 6వ సీడ్, ఇండోనేషియాకు చెందిన లియో రాలీ కార్నడో-డేనియల్ మార్టిన్‌ను చిత్తు చేసింది. గంట పాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. తొలి గేమ్ నుంచి మ్యాచ్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. 5-3తో వెనుకబడిన సాత్విక్ జోడీ ఆ తర్వాత బలంగా పుంజుకుని ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వకుండా తొలి గేమ్‌ను గెలుచుకుని శుభారంభం చేసింది.

- Advertisement -

అనంతరం ప్రత్యర్థి షట్లర్లు రెండో గేమ్‌లో భారత షట్లర్లకు షాకిచ్చారు. నువ్వానేనా అన్నట్టు సాగిన ఈ గేమ్‌‌లో మొదట సాత్విక్ జోడీనే(Satwik Chirag) ఆధిక్యంలో ఉన్నది. అయితే, 11-11తో స్కోరును సమం చేసిన ఇండోనేషియా జంట ఆ తర్వాత జోరు పెంచింది. సాత్విక్ జోడీ పోటీనిచ్చినప్పటికీ గేమ్‌ను గెలవలేకపోయింది. ఇక, నిర్ణయాత్మక మూడో సెట్‌లో భారత ద్వయం పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఏకపక్షంగా సాగిన ఈ గేమ్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకుని టోర్నీలో మరో అడుగు వేసింది.

Read Also: ముగిసిన కౌన్సెలింగ్ ప్రక్రియ.. భర్తీకాని ఇంజినీరింగ్ సీట్లు
Follow us on: Threads, Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Harish Rao | కాంగ్రెస్ ఫోకస్ కోతలు, పరిమితులపైనే -హరీష్ రావు

కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు, అమలుకు మధ్య చాలా వ్యత్యాసం ఉందని...

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...