రేపే ఉప్పల్ మైదానంలో IPL మ్యాచ్.. 1500 మంది పోలీసులతో భారీ భద్రత

-

Uppal Stadium |ఈ ఐపీఎల్ సీజన్ క్రికెట్ అభిమానులలో కొత్త జోష్ నింపడానికి సిద్ధమైంది. ముఖ్యంగా హైదరాబాద్ క్రికెట్ అభిమానులకు ఈ సండే ప్రత్యేకంగా మారబోతోంది. ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్(IPL) మ్యాచ్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుంది. నగరంలోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఆదివారం(ఏప్రిల్ 2వ తేదీ) సన్‌ రైజర్స్ హైదరాబాద్‌–రాజస్థాన్ రాయల్స్‌ మధ్య రాత్రి 7 గంటలకు మ్యచ్ జరుగనుంది. ఈ క్రమంలో స్టేడియం వద్ద భద్రత ఏర్పాట్లపై రాచకొండ సీపీ చౌహాన్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉప్పల్ స్టేడియం(Uppal Stadium)లో జరిగే అన్ని మ్యాచ్‌లకు భద్రతా ఏర్పాట్లపై అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని సీపీ చౌహాన్ చెప్పారు. స్టేడియం దగ్గర 1500 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు సీపీ చౌహాన్. ప్రేక్షకులకు, సామాన్య ప్రజలకు, మ్యాచ్‌కి వచ్చే ప్రముఖులకు, ప్లేయర్స్‌కి.. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఎక్కడైనా సమస్య తలెత్తితే వెంటనే పరిష్కరించాడానికి క్విక్ రియాక్షన్ టీమ్స్ పెట్టామన్నారు సీపీ. క్రికెట్ ఫ్యాన్స్ కూడా తమకు సహకరించాలని.. పిచ్‌లోపలికి వెళ్లడానికి ప్రయత్నించొద్దని సూచించారు.

- Advertisement -
Read Also: BRS MP సంతోష్ కుమార్‌కు అరుదైన గౌరవం

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

KTR | మేడిగడ్డ బ్యారేజీ కేసులో కేటీఆర్ కి భారీ ఊరట

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) కి తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట...

Gold Prices | ఇండియాలో రూ. లక్ష వైపు పరుగులు పెడుతున్న బంగారం ధరలు

Gold Prices | ప్రపంచ వాణిజ్య యుద్ధం, US డాలర్ బలహీనతపై...