FIFA Womens World Cup | ఫిఫా మహిళల వరల్డ్‌కప్-2023 విజేతగా స్పెయిన్ నిలిచింది. ఆదివారం సిడ్నీలో జరిగిన ఫైనల్ మ్యాచులో ఇంగ్లండ్ జట్టుపై 1-0తో గెలిచి ఛాంపియన్‌గా అవతరించింది. తొలి నుంచి మ్యాచ్ ఆద్యంతం ఉత్కంఠంగా సాగింది. 29వ నిమిషంలో కెప్టెన్ ఓల్గా కార్మోనా గోల్ చేయడంతో స్పెయిన్ శిబిరంలో ఆనందోత్సవాలు నెలకొన్నాయి. అనంతరం ఇంగ్లండ్ టీమ్ కూడా గోల్ కోసం తీవ్రంగా ప్రయత్నించగా అదృష్టం కలిసి రాలేదు. తొలి హాఫ్ పూర్తి కాగానే స్పెయిన్ 1-0తో ముందుంది. తర్వాత ప్రారంభమైన సెకండ్ హాఫ్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. దీంతో స్పెయిన్ జట్టు విశ్వవిజేతగా అవతరించింది.
ఇక మూడో స్థానం కోసం శనివారం జరిగిన మ్యాచ్‌లో స్వీడన్ 2-0తో ఆస్ట్రేలియాను ఓడించి కాంస్య పతకం అందుకుంది. మొత్తానికి వరల్డ్‌కప్ టోర్నీ ప్రపంచవ్యాప్తంగా అభిమానులను అలరించింది. జులై 20న ప్రారంభమైన ఈ మెగా టోర్నీలో మొత్తం 32 దేశాలు పాల్గొన్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా అమెరికా మహిళల జట్టు బరిలో దిగింది.
8 గ్రూపులుగా 32 జట్లు ఈ టోర్నీ( FIFA Womens World Cup)లో పాల్గొన్నాయి:
గ్రూప్ A:న్యూజిలాండ్, నార్వే, ఫిలిప్పీన్స్, స్విట్జర్లాండ్
గ్రూప్ B:ఆస్ట్రేలియా, ఐర్లాండ్, నైజీరియా, కెనడా
గ్రూప్ C:స్పెయిన్, కోస్టారికా, జాంబియా, జపాన్
గ్రూప్ D:ఇంగ్లండ్, హైతీ, డెన్మార్క్, చైనా
గ్రూప్ E:నెదర్లాండ్స్, పోర్చుగల్, యునైటెడ్ స్టేట్స్, వియత్నాం
గ్రూప్ F:బ్రెజిల్, ఫ్రాన్స్, జమైకా, పనామా
గ్రూప్ G:అర్జెంటీనా, ఇటలీ, దక్షిణాఫ్రికా, స్వీడన్
గ్రూప్ H: జర్మనీ, మొరాకో, కొలంబియా, సౌత్ కొరియా