SRH హాట్రిక్ ఓటమి.. ఢిల్లీ క్యాపిటల్స్ ఘన విజయం

-

హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానం వేదికగా జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌(SRH)పై 7 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals) విజయం సాధించింది. ఈ విన్నింగ్‌తో వరుసగా రెండో విజయాన్ని నమోదు చేయగా, హైదరాబాద్ జట్టు వరుసగా మూడో ఓటమిని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ 20 ఓవర్లలో 144 పరుగులు చేసింది. ఆ తరువాత ఇన్నింగ్స్ ప్రారంభించిన హైదరాబాద్ 6 వికెట్లకు 137 పరుగులు మాత్రమే చేయగలిగింది.

- Advertisement -

మయాంక్ అగర్వాల్ హైదరాబాద్ తరఫున అత్యధికంగా 49 పరుగులు చేశాడు. చివరి బంతి వరకు ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరు సాగింది. చివరి ఓవర్లో హైదరాబాద్(SRH) విజయానికి 6 బంతుల్లో 13 పరుగులు చేయాల్సి ఉంది. వాషింగ్టన్ సుందర్(Washington Sundar) దూకుడుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ ముఖేష్ కుమార్(Mukesh Kumar) చివరి ఓవర్లో కట్టుదిట్టమైన బౌలింగ్ చేసి 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. సుందర్ 15 బంతుల్లో 24 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. చివరకు హైదరాబాద్ జట్టు ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Read Also: ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ మరో రికార్డు

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Kejriwal | ఢిల్లీ సీఎం అరెస్ట్ అవుతారు.. కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు

ఢిల్లీ సీఎం అతిశీ అరెస్ట్ అవుతారని ఆ రాష్ట్ర మాజీ సీఎం...

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటన.. వీడియోలపై పోలీసుల సీరియస్ వార్నింగ్

Sandhya Theatre Issue | సంధ్య థియేటర్ ఘటనలో ఫేక్ ప్రచారంపై...