కేటీఆర్‌ను బర్తరఫ్ చేసేవరకు పోరాడుతాం: Bandi Sanjay

-

టీఎస్‌పీఎస్‌పీ ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారంపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన మంత్రి కేటీఆర్‌(KTR)ను బర్తరఫ్ చేసి, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఉమ్మడి పాలమూరు జిల్లా కేంద్రంలో మంగళవారం ‘నిరుద్యోగ మార్చ్(Nirudyoga March)’ తలపెట్టినట్లు తెలిపారు. ఈ మార్చ్‌కు నిరుద్యోగులు పెద్ద ఎత్తున తరలిరావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. 30 లక్షల మంది నిరుద్యోగులు రోడ్డున పడి గోస పడుతున్నా సీఎం స్పందించడం లేదని మండిపడ్డారు.

- Advertisement -

ఈ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపడంతోపాటు ఐటీశాఖ మంత్రిని బర్తరఫ్ చేసేదాకా, నిరుద్యోగులకు రూ.లక్ష పరిహారం ఇచ్చేదాకా తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. కేసీఆర్(KCR) ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు నిరుద్యోగుల గొంతు కోస్తోందన్నారు. రాష్ట్రంలో 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తానని హామీ ఇచ్చి మోసం చేశారన్నారు. అసెంబ్లీ వేదికగా 80 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి నేటికీ ఒక్క ఉద్యోగం భర్తీ చేయకుండా కాలయాపన చేస్తున్నారని సంజయ్(Bandi Sanjay) విమర్శలు గుప్పించారు.

Read Also: ఆ బాధ్యత నేను తీసుకుంటా.. మహరాష్ట్ర ప్రజలకు కేసీఆర్ హామీ

Follow us on: Google News, Koo, Twitter

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ పై కాంగ్రెస్ దాడి

నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి మండల కేంద్రంలోని డోకూరు పంక్షన్ హాలులో...

ఈ నవరత్నాలు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి

Health Benefits of Millet | మన భారత దేశంలోని రైతులు...