ఆస్ట్రేలియాతో భారత్ ఆడుతున్న బోర్డర్-గవాస్కర్ ట్రోపీ(Border Gavaskar Trophy) టీమిండియా హెడ్ కోచ్ గంభీర్(Gautam Gambhir)కు అగ్ని పరీక్షలా మారింది. భారత హెడ్ కోచ్‌గా గంభీర్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి భారత్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. దాదాపు 12 ఏళ్ల తర్వాత సొంత గడ్డపై టెస్ట్ సిరీస్‌ను ఓడిన ఘనత కూడా గంభీర్ ఖాతాలో పడింది. ఇప్పుడు ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌లో టీమిండియా అంతగా రాణించకపోతే గంభీర్‌పై వేటు వేయాలని బీసీసీఐ(BCCI) ప్లాన్ చేస్తోంది. దీంతో ఈ సిరీస్ టీమిండియా కన్నా గంభీర్‌కు ముఖ్యంగా మారింది. ఈ క్రమంలోనే టీమిండియా హెడ్ కోచ్ గంభీర్‌కు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రీ(Ravi Shastri) కీలక సలహా ఇచ్చాడు. ఈ పరిస్థితుల్లో గంభీర్ చేయాల్సిన ప్రధానమైన పని ప్రశాంతంగా ఉండటం అని శాస్త్రి సూచించాడు.
‘‘గంభీర్ చేయాల్సిన మొదటి పని ప్రశాంతంగా ఉండటం. బయటి విషయాలు తనను ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. ఆటగాళ్లను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఒక ఆటగాడు రాణించాలంటే అతడికి ఏది అవసరమో గమనించి దానిని అందివ్వాలి. క్రికెటర్ల స్వభావంపై అవగాహన వస్తే పరిస్థితులకు తగ్గట్లు ఎవరు జట్టుకు అవసరమో తెలుసుకోవచ్చు’’ అని సలహా ఇచ్చాడు శాస్త్రి. రవి(Ravi Shastri) హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో ఆసిస్ గడ్డపై భారత్ రెండుసార్లు విజయం సాధించింది. దీంతో ఇప్పుడు అతడి సలహాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. మరి వాటిని గంభీర్ స్వీకరిస్తాడా.. తుంగలో తొక్కి ఇబ్బందులు పడతాడా అనేది చూడాలి.