టీమిండియా మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనా(Suresh Raina) లంక ప్రీమియర్ లీగ్(LPL)లో ఆడేందుకు రెడీ అయ్యాడు. 2023లో జరిగే సీజన్ కోసం తొలిసారిగా ఐపీఎల్ తరహాలో నిర్వహించనున్న వేలం ప్రక్రియ జూన్ 14న ప్రాంభంకానుంది. 140 మంది అంతర్జాతీయ క్రికెటర్లతో సహా మొత్తం 500 మందికి పైగా క్రికెటర్లు ఈ వేలం జాబితాలో ఉన్నారు. దీంతో ఈ వేలంలో 50,000 డాలర్లు(సుమారు 41 లక్షల 30 వేల రూపాయలు) బేస్‌ప్రైస్‌తో రైనా తన పేరు నమోదు చేసుకున్నాడు. గతేడాది అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్లకు రిటైర్మెంట్ ప్రకటించిన రైనా(Suresh Raina) విదేశీ లీగ్‌లపై మాత్రం దృష్టి పెట్టాడు. ఈ క్రమంలోనే అబుదాబి టీ10 లీగ్-2022లో డెక్కన్ గ్లాడియేటర్ తరపున ఆడాడు. ఇప్పుడు మరోసారి లంక లీగ్ ద్వారా అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. కాగా ఈ ఏడాది జూలై 30 నుంచి ఆగస్టు 20 వరకు LPL జరగనుంది.