Rohit sharma: ఇప్పుడు అదే మాకు పెద్ద సవాల్‌: రోహిత్‌

-

Rohit sharma :గత 9 ఏళ్లుగా ఐసీసీ ట్రోఫీ సాధించకపోవటమే.. ఇప్పుడు తమ ముందున్న పెద్ద సవాల్‌ అని టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ. ప్రస్తుతం తమ దృష్టి అంతా టీ20 ప్రపంచ కప్‌ టోర్నీపైనే ఉందని తెలిపారు. భవిష్యత్తు టోర్నీల గురించి బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆసియా కప్‌ 2023 టోర్నీ కోసం భారత జట్టు పాకిస్థాన్‌లో పర్యటించదని ఏసీసీ అధ్యక్షుడు జై షా చేసిన వ్యాఖ్యలకు.. పాక్‌ ఘాటుగా స్పందించింది. అలా జరిగితే, భారత్‌ వేదికగా జరిగే వన్డే ప్రపంచకప్‌లో పాల్గొనమని పాక్‌ ప్రకటించింది.

- Advertisement -

ఈ పరిణామాలపై టీమిండియా కెప్టెన్‌ స్పందించారు. ” భవిష్యత్తులో ఏం జరుగుతుందని ఇప్పుడే ఆందోళనపడటం లేదు. ప్రస్తుతం టీ20పైనే మా దృష్టి ఉంది. అయినా ఇతర దేశాల పర్యటన గురించి మేము ఆలోచించాల్సిన అవసరం లేదు. వాటిపై బీసీసీఐ నిర్ణయం తీసుకుంటుంది” అని రోహిత్‌ స్పష్టం చేశారు. టీ20 ప్రపంచకప్‌ సంగ్రామంలో భారత్‌ తన తొలి మ్యాచ్‌ పాకిస్థాన్‌తో తలపడనుంది. ఈ క్రమంలోనే రోహిత్‌ శర్మ మీడియాతో మాట్లాడాడు. ప్రస్తుతం మ్యాచ్‌కు ఎలా సన్నద్ధం కావాలో అన్నదానిపైనే దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. తుది జట్టుపైనా పూర్తి స్పష్టతో ఉన్నామనీ.. ప్రతి మ్యాచ్‌కు మార్పులు చేయాల్సిన అవసరం లేదని రోహిత్‌ (Rohit sharma)  తెలిపారు.

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...