టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆదివారం ఉదయం ఫ్యామిలీతో వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. ముందుగా ఆయనకు తిరుమల ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. హిట్‌మ్యాన్ వచ్చాడన్న విషయం తెలుసుకున్న అభిమానులు భారీగా అక్కడకు చేరుకున్నారు. ఫొటోలు దిగేందుకు ఎగబడ్డారు. అప్రమత్తమైన పోలీసులు భక్తులను చెదరగొట్టి రోహిత్‌కు భారీ భద్రత కల్పించారు.
తిరుమలలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ సందడి
-