ప్రతీకారం తీర్చుకున్న రోహిత్ సేన.. సగర్వంగా ఫైనల్లోకి..

-

World Cup 2023 |నాలుగేళ్ల క్రితం ప్రతి భారతీయుడు పడిన ఆవేదనకు రోహిత్ సేన వడ్డీతో సహా ప్రతీకారం తీర్చుకుంది. నాలుగేళ్ల పాటు తాము పడిన కన్నీటి వేదనను న్యూజిలాండ్‌కు తిరిగిచ్చేసింది. ప్రపంచకప్‌ కలను తమకు దూరం చేసిన జట్టుకు.. అదే ప్రపంచకప్‌ కలను దూరం చేస్తూ సగర్వంగా మెగా టోర్నీ ఫైనల్‌లో అడుగుపెట్టింది. వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌ మ్యాచ్‌లో భారత్ అదరగొట్టింది.

- Advertisement -

ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో కేవలం నాలుగు వికెట్లు కోల్పోయి 397 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ (117), శ్రేయస్ (105) శతకాలతో అదరగొట్టారు. శుభ్‌మన్ గిల్ (80 నాటౌట్), రోహిత్ శర్మ (47) రాణించగా.. చివర్లో కేఎల్ రాహుల్ 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులతో మెరుపులు మెరిపించాడు. ఇక కివీస్ బౌలర్లలో టిమ్ సౌథీ 100 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టగా.. ట్రెంట్ బౌల్ట్‌ ఒక వికెట్ తీశాడు.

World Cup 2023 | అనంతరం 398 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్‌ గొప్పగా పోరాడింది. ఆరంభంలో ఓపెనర్లు కాన్వే, రచిన్‌ను త్వరగా పెవిలియన్‌కు పంపించాడు షమీ. అయితే కేన్‌ విలియమ్సన్‌, డేరిల్‌ మిచెల్‌ నిలకడగా ఆడుతూ స్కోర్‌ బోర్డును పరిగెత్తించారు. ఓ దశలో ఆటగాళ్లతో పాటు అభిమానులను భయపెట్టారు. కానీ మరోసారి షమీ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసి టీమిండియాను పోటీలోకి తెచ్చాడు. 119 బంతుల్లో 9 ఫోర్లు, 7 సిక్సులతో 134 పరుగులు చేసిన మిచెల్‌ చివరి వరకు పోరాడాడు. కానీ చివర్లో రన్‌రేట్‌ పెరగడంతో ఒత్తిడి పెరిగి కివీస్‌ వరుసగా వికెట్లు కోల్పోయి ఆలౌటైంది. భారత బౌలర్లలో షమీ 57 పరుగులు ఇచ్చి 7 వికెట్లు తీశాడు. దీంతో రోహిత్ సేన ఫైనల్‌కు చేరగా.. కివీస్ ఇంటిబాట పట్టింది.

Read Also: సచిన్ సెంచరీల రికార్డు బద్దలుకొట్టిన విరాట్ కోహ్లీ..
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...