ఎట్టకేలకు ఆసియా కప్‌కు భారత జట్టు ఫైనల్ అయింది. ఈ జట్టులో ఎవరు చోటు దక్కించుకున్నారు? సీనియర్లు, జూనియర్లతో జట్టు సమతూకంగా ఉందా? బుల్లెట్ వంటి బంతులతో ప్రత్యర్థికి చుక్కలు చూయించే బుమ్రా జట్టులో ఉన్నాడా? లేదా? వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం..
ఆసియా కప్‌కు ఆడే జట్టును బీసీసీఐ ప్రకటించింది. రోహిత్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ తిరిగి జట్టులోకి వచ్చారు. గాయం కారణంగా కొన్నాళ్లుగా జట్టుకు దూరంగా ఉన్న రాహుల్ ఫిట్నెస్ నిరూపించుకున్నాడు. మళ్లీ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. మొత్తం 15 మందితో టీమ్‌ను ఎంపికి చేసింది.
భారత జట్టు: రోహిత్ శర్మ(కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషభ్ పంత్(వికెట్‌కీపర్), హార్దిక్ పాండ్య, దినేశ్ కార్తిక్(వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, చాహల్, బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేశ్ ఖాన్.
స్టాండ్-బై ప్లేయర్లు: దీపక్ చాహర్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్
హర్షల్ పటేల్, బుమ్రా గాయాల కారణంగా దూరమయ్యారు.