బెన్ స్టోక్స్ బెస్ట్ ఇన్నింగ్స్ ఇవే..

0
99

ఇంగ్లాండ్​ స్టార్​ ఆల్​రౌండర్ బెన్ స్టోక్స్​ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. మంగళవారం డర్హమ్​లో దక్షిణాఫ్రికాతో జరగబోయే మ్యాచ్​ తనకు చివరిదని తెలిపాడు. ఈ ఫార్మాట్‌లో జట్టుకు ఇకపై అత్యుత్తమ సేవలు అందించలేనని అందుకే, వన్డే క్రికెట్​కు వీడ్కోలు పలుకుతున్నట్లు స్టోక్స్ తెలిపాడు. ఈ నేపథ్యంలో అతని బెస్ట్ ఇన్నింగ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

ఇంగ్లాండ్‌కు క్రికెట్‌ పుట్టినిల్లన్న పేరే తప్ప వన్డే ప్రపంచకప్‌ గెలిచింది లేదు. దీంతో ఆ జట్టును ఎవరైనా విమర్శించాలంటే ఈ అస్త్రాన్నే మాటల తూటాల్లా వినియోగించేవారు. కానీ.. వాటికి బెన్‌స్టోక్స్‌ ఫుల్‌ స్టాఫ్‌ పెట్టాడు. దశాబ్దాల కలను నెరవేరుస్తూ 2019 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో ఇంగ్లాండ్‌ను విజేతగా నిలబెట్టాడు.

2017 ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఆస్ట్రేలియాను ఢీకొట్టేందుకు ఇంగ్లాండ్‌ సిద్దమైంది. ఎడ్జ్‌బాస్టన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ టాస్‌ గెలిచి ప్రత్యర్థి జట్టుకు బ్యాటింగ్‌ అప్పగించింది. ఫించ్‌, స్మిత్‌, హెడ్‌ అర్ధశతకాలతో నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి ఆస్ట్రేలియా 277 పరుగులు చేసింది. ఈ క్రమంలోనే స్టోక్స్‌ 39 బంతుల్లో అర్ధశతకం పూర్తిచేశాడు. ఇక జంపా వేసిన ఇన్నింగ్స్‌ 40 ఓవర్‌ తొలిబంతికి ఫోర్‌కొట్టి స్టోక్స్‌(109 బంతుల్లో 102; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) తన కెరీర్‌లో తొలి శతకం నమోదు చేశాడు.

ఇంగ్లాండ్‌ 2021లో టీమ్‌ఇండియాపై మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌ ఓడిపోయింది. పుణె వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ బ్యాటర్లు చెలరేగారు. రాహుల్‌ శతకం, కోహ్లీ, పంత్‌ అర్ధశతకాలతో టీమ్‌ఇండియా 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది.  భారీ లక్ష్య ఛేదనలో 40 బంతుల్లో 50 పరుగులు చేసిన స్టోక్స్‌ … ఆ తర్వాత వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీకి తరలిచ్చాడు.

2019లో పాకిస్థాన్‌ ఐదు వన్డేల సిరీస్‌ ఆడేందుకు ఇంగ్లాండ్‌లో పర్యటించింది. సిరీస్‌లో రెండు మ్యాచులు ఓడిపోగా, ఒక మ్యాచ్‌ రద్దయ్యింది. కీలకమైన నాలుగో వన్డేలో ఓడితే సిరీస్‌ గల్లంతే. పాక్‌ బ్యాటర్లు 50 ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 340 పరుగులు చేసింది. ఈ దశలో స్టోక్స్‌ (64 బంతుల్లో 71; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) ఇన్నింగ్స్‌తో పాక్‌ ఆశలు ఆవిరయ్యాయి. టెయిలెండర్లతో కలిసి జట్టుకు విజయాన్ని అందించాడు.