2022 ఆసియా గేమ్స్‌ రీషెడ్యూల్​ తేదీలు ఇవే..

0
77

వాయిదా పడిన 2022 ఆసియా గేమ్స్‌ రీషెడ్యూల్​ తేదీలు ఖరారు అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్‌ 10 నుంచి 25 తేదీల మధ్య చైనాలోని హాంగ్‌జావ్‌ నగరంలో జరగాల్సిన 2022 ఆసియా గేమ్స్‌ను ఇటీవలే వాయిదా వేశారు.

అయితే తాజాగా రీషెడ్యూల్​ ​తేదీలను ప్రకటించింది ఒలింపిక్​ కౌన్సిల్​ ఆఫ్ ఆసియా. 2023 సెప్టెంబరు 23 నుంచి అక్టోబర్​ 8 వరకు నిర్వహించబోతున్నట్లు తెలిపింది. కాగా, ఈ ఆసియా గేమ్స్​ ఎందుకు వాయిదా వేశారో స్పష్టతమైన కారణాలు తెలియదు.

అయితే ఈ గేమ్స్‌ నిర్వహించాల్సిన హాంగ్‌జావ్‌ ప్రాంతం అక్కడి ప్రధాన నగరమైన షాంఘైకు సమీపంలో ఉంటుంది. ప్రస్తుతం అక్కడ కొవిడ్‌ కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో లాక్‌డౌన్‌ అమలుచేస్తున్నట్లు తెలిసింది. అందుకే ఈ క్రీడలను వాయిదా వేసినట్లు సమాచారం.