India vs West Indies | భారత్, వెస్టిండీస్ మధ్య ఆదివారం రెండో టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లో గయానాలోని ప్రొవిడెన్స్‌లో జరగనుంది. తొలి టీ20 ట్రినిడాడ్‌లోని బ్రియాన్ లారా స్టేడియంలో జరిగ్గా.. నాలుగు పరుగుల తేడాతో విండీస్ జట్టు విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 0-1తో లీడ్‌లో ఉంది. దీంతో ఇరు జట్లు రెండో టీ20 మ్యాచ్‌లో ఫోకస్ పెట్టాయి.
India vs West Indies | కాగా, గత మొదటి టీ20 మ్యాచ్‌లో టీమిండియా 150 పరుగుల లక్ష్యాన్ని అందుకోలేకపోయింది. టాస్ గెలిచిన వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుని, 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. ఆ తర్వాత భారత జట్టు 9 వికెట్లకు 145 పరుగులు మాత్రమే చేయగలిగింది. జట్టులో సీనియర్ల లేకపోవడంతోనే పరాజయం తప్పలేదని క్రికెట్ నిపుణులు భావిస్తున్నారు.