ఐపీఎల్లో రికార్డుల వేట కొనసాగుతూనే ఉంది. సీజన్ ప్రారంభంలోనే ధోనీ(MS Dhoni) ఐపీఎల్‌లో చేసిన పరుగుల్లో అరుదైన మైలు రాయిని చేరుకోగా, రోహిత్ శర్మ(Rohit Sharma) సిక్సర్ల రికార్డు నెలకొల్పాడు. ఇక తాజాగా.. రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ(Virat Kohli) సైతం నయా రికార్డు సృష్టించాడు. ఐపీఎల్లో అరుదైన రికార్డు తన పేరుమీద లిఖించుకున్నాడు. ఐపీఎల్ చరిత్రలో వంద క్యాచులు పట్టిన మూడో ఆటగాడిగా కోహ్లీ చరిత్రకెక్కాడు. ఏప్రిల్ 23వ తేదీన రాజస్థాన్ రాయల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య జరిగిన మ్యాచులో కోహ్లీ ఈ రికార్డును అందుకున్నాడు.
బెంగళూరు చినస్వామి స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్‌లో విరాట్(Virat Kohli) గోల్డెన్ డక్ అయ్యాడు. అయితే బ్యాటింగ్‌లో విఫలమైనా ఫీల్డింగ్లో సత్తా చాటాడు. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్లు యశస్వి జైస్వాల్, దేవదత్ పడిక్కల్‌లు ఇచ్చిన క్యాచులను ఒడిసిపట్టుకున్నాడు. దీంతో ఐపీఎల్‌లో వంద క్యాచులు పూర్తి చేసుకున్నాడు. అంతేకాదు బెంగుళూరు జట్టు తరపున వంద క్యాచులు పట్టిన ఏకైక ఆటగాడిగానూ కోహ్లీ రికార్డు నెలకొల్పాడు.
Read Also: ఏంటి బాసూ రహానేకు ఏమైంది? అసలు ఆ కొట్టుడేంటి
Follow us on: Google News, Koo, Twitter