IND vs NZ Test | భారత్, న్యూజిలాండ్ తొలి టెస్టుకు వరుణుడు అడ్డంగా నిలుస్తున్నాడు. తొలి రోజే ప్రేక్షకుల కన్నా ముందొచ్చి టాస్ కూడా వేయకుండా మ్యాచ్‌ను అడ్డుకున్నాడు వరుణుడు. దీంతో రెండో రోజైనా మ్యాచ్ మొదలవుతుందా? అన్న ఉత్కంఠ అబిమానుల్లో క్షణక్షణానికి పెరిగిపోతోంది. రిపోర్ట్‌లు ఒకటి చెప్తున్నా.. ఏం జరుగుతుందో అన్న అనుమానాలు మాత్రం అభిమానుల్లో ఏమాత్రం తగ్గట్లేదు. బెంగళూరులో ఆక్యూ వెదర్ రిపోర్ట్ ప్రకారం మ్యాచ్ టాస్ వేసే సమయం 8:45 గంటల సమయానికి వర్షం పడే అవకాశాలు లేవు. కాగా మధ్యాహ్నం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు చినుకులు పడే అవకాశం ఉందని వివరిస్తున్నాయి రిపోర్ట్‌లు. ఆ తర్వాత వర్షం తగ్గిపోతోందని చెప్పాయి. ఆ తర్వాత మైదానాన్ని ఆటకు సిద్ధం చేయడం కోసం కనీసం గంట సమయం పడుతుంది. ఆ లోపు వర్షం పడకపోతే సరిపోతుందని అంతా అనుకుంటున్నారు.
IND vs NZ Test | ఈ మ్యాచ్‌కు తొలిరోజు వర్షం దంచి కొట్టింది. కాసేపు ఆగినప్పటికీ మైదానం అంతా చిత్తడిచిత్తడిగా తయారైంది. మైదానాన్ని సిద్ధం చేయడం కోసం కవర్లు తీసిన వెంటనే.. మళ్ళీ చినుకులు పడటంతో ఇబ్బందులు తలెత్తాయి. ఎంత సేపటికి వర్షం తగ్గకపోవడంతో తొలిరోజుకు ఆటను రద్దు చేస్తున్నట్లు అంపైర్టు ప్రకటించారు. అంతేకాకుండా వర్షం కాసేపు ఆగినప్పటికీ డీఆర్ఎస్ కోసం వినియోగించే టెక్నాలజీ ఇన్‌స్టాల్ చేయడం కోసం చాలా సమయం పడుతుందని మ్యాచ్ నిర్వాహకులు చెప్తున్నారు. స్టంప్స్‌లో ఇన్‌స్టాల్ చేయాల్సి ఉంటుంది. అందుకోసం వర్షం పడకుండా ఉండాలి. మైదానం సిద్ధం చేసే సమయంలో హాక్‌ఐ సిస్టమ్‌ను ఇన్‌స్టార్ చేసే అవకాశం లేదని నిర్వాహకులు చెప్తున్నారు. దీంతో మైదానం సిద్ధం చేయడం కోసం కనీసం రెండు మూడు గంటలు పడుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.