Nothing relase transparent Ear Stick: ట్రాన్స్‌పరెంట్ ప్రొడక్ట్స్‌తో నథింగ్ ఎంత పాపులర్ అయ్యిందో తెలిసిందే. నథింగ్ ఇయర్ 1, నథింగ్ ఫోన్ 1 కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిన విషయమే. తాజాగా మరో క్రేజీ గ్యాడ్జెట్‌ను నథింగ్ తీసుకువచ్చింది. అవే నథింగ్ ఇయర్ స్టిక్స్. ఇవి కూడా ట్రాన్స్‌పరెంట్ డిజైన్‌తో మార్కెట్లో విడుదల చేసింది. ఇవి చూడటానికి లిప్‌స్టిక్‌లా ఉంటుంది. జస్ట్ ట్విస్ట్ చేసి.. కేస్‌ను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇది నథింగ్ నుంచి వచ్చిన రెండో ఆడియో ప్రొడక్ట్ కాగా, హాఫ్ ఇన్ ఇయర్ డిజైన్‌తో ఈ ఇయర్ బడ్స్‌ను తయారు చేసింది.
ఛార్జింగ్ కేస్‌తో మెుత్తం 29 గంటల బ్యాటరీ లైఫ్ అందిస్తుందని కంపెనీ చెప్తుంది. ఛార్జింగ్ కేస్‌ను కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే.. 2 గంటల పాటు వాడుకోవచ్చునని కంపెనీ చెప్తోంది. టైప్ సీ పోర్ట్‌తో ఛార్జింగ్‌కు వెసులుబాటు కల్పించినట్లు తెలిపింది. IP54 రేటింగ్ ఉండగా.. వాటర్ ప్రూఫ్, స్వేట్ ప్రూఫ్ ప్రొటెక్షన్ లభిస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ (Nothing Ear Stick) ఇయర్ స్టిక్స్‌ను గూగుల్ ఫాస్ట్, మైక్రోసాఫ్ట్ స్విఫ్ట్‌తో పెయిర్ చేసుకునే ఫీచర్స్ ఉన్నాయి. గెస్చర్ కంట్రోల్ ఫీచర్ అందుబాటులో ఉన్నట్లు వివరించింది. ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైజ్‌లకు కనెక్ట్ చేసుకోవచ్చునని నథింగ్ చెప్తోంది.