PhonePe Google Pay NPCI extends deadline: నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) గూగుల్‌పే, ఫోన్‌పే లాంటి యాప్‌లను ప్రొవైడర్స్ నిర్వహిస్తున్న యూపీఐ చెల్లింపు సేవ కోసం మొత్తం లావాదేవీల పరిమితిని 30 శాతానికి పరిమితం చేసే నిర్ణయంపై భారతీయ రిజర్వ్ బ్యాంక్‌తో చర్చలు జరుపిన విషయం తెలిసిందే. కాగా.. యూపీఐ పేమెంట్ సర్వీసులను అందిస్తున్న గూగుల్‌పే, ఫోన్‌పే లాంటి యాప్ యూపీఐ లావాదేవీలపై పరిమితి విధించాలన్న ప్రతిపాదనను ఎన్‌పీసీఐ మరో రెండేళ్లపాటు పొడిగించింది. ఈ మేరకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) UPIలోని థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్లు వాల్యూమ్ క్యాప్‌ను 30 శాతం పరిమితం చేసే గడువును డిసెంబర్ 31, 2024 వరకు పొడిగించింది. దాదాపు 80 శాతం మార్కెట్ వాటా ఉన్న గూగుల్ పే, ఫోన్‌పే (PhonePe Google Pay) సహా ఇతర యాప్స్‌కు ఇది భారీ ఉపశమనం అని చెప్పవచ్చు