Telangana Budget: తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ తమిళిసై బడ్జెట్ ప్రసంగం కాపీ తయారు చేయడంలో జాగ్రత్తలు తీసుకున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం పై ఎక్కడా విమర్శలు చేయకుండా ఆచి తూచి వ్యవహరించింది. కేవలం రాష్ట్ర ప్రభుత్వ స్కీములు, అభివృద్ధి కార్యక్రమాలను మాత్రమే స్పీచ్ లో చేర్చింది. గవర్నర్ తమిళిసైతో గత కొంతకాలంగా రాష్ట్ర ప్రభుత్వా నికి సఖ్యత లేని విషయం తెలిసిందే. చాలా రోజులుగా రాజ్ భవన్ వర్సెస్ ప్రగతి భవన్ అన్నట్టుగా వ్యవహారం మారింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన బడ్జెట్ కు గవర్నర్ ఆమోదం తెలుపలేదు. దీంతో ఈ వ్యవహారం కోర్టుకు చేరింది. ఎట్టకేలకు గవర్నర్ బడ్జెట్ ను ఆమోదించారు.