Telangana Elections | ఓటమి బాటలో ఆరుగురు మంత్రులు..

-

Telangana Elections | తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో ప్రైమరీ రౌండ్స్ కౌంటింగ్ పూర్తయ్యేసరికి కాంగ్రెస్ మ్యాజిక్ ఫిగర్ ను దాటేసింది. మొత్తం 119 స్థానాలకు 69 స్థానాల్లో కాంగ్రెస్, 38 స్థానాల్లో బీఆర్ఎస్, 10 స్థానాల్లో బిజెపి, 3 స్థానాల్లో ఎంఐఎం ఆధిక్యం కనబరుస్తున్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి మినహా అన్ని జిల్లాల్లో కాంగ్రెస్ ఆధిపత్యంలో ఉంది. ఇప్పటివరకు పూర్తయిన కౌంటింగ్ లో కాంగ్రెస్ మెజారిటీ కనబరచడంతో పార్టీ శ్రేణులు తెలంగాణ అంతటా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు.

- Advertisement -

Telangana Elections | ఇదిలా ఉండగా ఓటమి బాటలో ఆరుగురు మంత్రులు ఉన్నట్టు ఫలితాలు సూచిస్తున్నాయి. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, పువ్వాడ అజయ్, నిరంజన్ రెడ్డి, ప్రశాంత్ రెడ్డి వెనుకంజలో ఉన్నారు. స్పష్టమైన ఆధిక్యతతో కేటీఆర్ హరీష్ రావు కొనసాగుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కూడా లీడ్ లో కొనసాగుతున్నారు. మంత్రి శ్రీనివాస్ రెడ్డి మహబూబ్ నగర్ లో స్వల్ప ఓట్లతో లీడింగ్ లో ఉన్నారు. ఇక గజ్వేల్, కామారెడ్డి నుంచి పోటీ చేసిన సీఎం కేసీఆర్.. గజ్వేల్ లో ఆధిక్యంలో ఉన్నప్పటికీ, కామారెడ్డి లో రేవంత్ రెడ్డిదే పైచేయిగా ఉంది.

Read Also: హైదరాబాద్ రెండో రౌండ్ లీడింగ్ లో ఎవరున్నారంటే?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

మరో చరిత్ర సృష్టించిర రొనాల్డో

క్రిస్టియానో రొనాల్డో(Cristiano Ronaldo).. ఈ పేరు తెలియని వారుండరు. ఫుట్ బాల్...

నన్ను ఆంధ్రవాడు అంటారా?: గాంధీ

బీఆర్ఎస్ నేత కౌశిక్ రెడ్డిపై పీఏసీ ఛైర్మన్ అరెకపూడి గాంధీ(Arekapudi Gandhi)...