నాంపల్లిలో భారీ అగ్నిప్రమాదం.. ఏడుగురు మృతి

-

హైదరాబాద్‌లోని నాంపల్లి(Nampally)లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. బజార్‌ఘాట్‌లోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగి ఐదో అంతస్తు వరకు వ్యాపించాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు సజీవదహనం అయ్యారు. ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది నాలుగు ఫైరింజన్ల సాయంతో మంటలను అదుపులోకి తెస్తున్నారు. అలాగే జీహెచ్‌ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది కూడా సహాయ చర్యలు చేపట్టారు.

- Advertisement -

గ్రౌండ్‌ఫ్లోర్‌లోని మెకానిక్ గ్యారేజ్‌లో కారు రిపేర్‌ చేస్తుండగా మంటలు వ్యాపించాయి. ఆ మంటలు పక్కనే ఉన్న డీజిల్‌, కెమికల్‌ డ్రమ్ములకు అంటుకోవడంతో ప్రమాద తీవ్రత భారీగా పెరిగింది. దీంతో పక్కనే అపార్ట్‌మెంట్లలో ఉంటున్నవారు భయాందోళనకు గురయ్యారు. నిచ్చెనల సహాయంతో మంటల్లో చిక్కుకున్న 15 మందిని రక్షించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Nampally | కెమికల్ గోదాం(Chemical Godown)లో అగ్ని ప్రమాదం జరిగడంతో అపార్ట్‌మెంట్‌లోకి మంటలు వ్యాపించాయని డీసీపీ వెంకటేశ్వర్లు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో కారు రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పైఅంతస్తులకు వ్యాపించాయన్నారు. దట్టమైన పొగతో ఊపిరాడక కొందరు చనిపోయారని.. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారని డీసీపీ వెల్లడించారు.

Read Also: బిల్వ వృక్షానికి ప్రాముఖ్యత ఎలా పెరిగింది?
Follow us on: Google News, Koo, Twitter, ShareChat

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Bhatti Vikramarka | మంత్రివర్గ విస్తరణపై తుది నిర్ణయం వారిదే: భట్టి

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy).. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సందర్బంగా...

Nayanthara | ‘నేనలాంటి వ్యక్తిని కాదు’.. ధనుష్‌తో వివాదంపై నయనతార

లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara), నటుడు ధనుష్‌(Dhanush) మధ్య తీవ్ర వివాదం...